హస్తినలో పీక్స్ కు పొల్యూషన్.. జీఆర్ఏపీ-3 మెజర్స్ అమలు

దేశ రాజధాని  నగరం ఢిల్లీలో కాలుష్యం పీక్స్ కు చేరింది. ఓ వైపు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, మరో వైపు పొగమంచు కారణంగా వాయుకాలుష్యం తార స్థాయికి చేరింది. గురువారం (జనవరి 30)న ఢిల్లీలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 381గా నమోదైంది.  అంటే ఢిల్లీలో వాయు నాణ్యత అధమ స్థాయికి పడిపోయింది.

ఏక్యూఐ పరంగా చెప్పాలంటే వెరీవెరీ పూర్ అని అర్ధం. దీంతో పరిస్థితిని నియంత్రించడానికి అధికా రులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.  ఇందుకోసం గ్రేడెన్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్ ( జీఆర్ఏపీ) స్టేజ్ 3 ప్రకారం నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ జీఆర్ఏపీ 3 మెజర్స్ ప్రకారం  గాలి నాణ్యత మరింత క్షీణించకుండా  ఉండేందుకు ఢిల్లీ వ్యాప్తంగా, అలాగే ఎన్సీఆర్ లో అన్నిరకాల నిర్మాణ కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధించారు. అలాగే పెట్రోల్, బీఎస్4, డీజిల్ ఫోర్ వీలర్లు రోడ్లపైకి రాకుండా నిషేధించారు.  ఇసుక, సిమెంట్ తదితర నిర్మాణ సాగమ్రి రవాణాపై ఆంక్షలు విధించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu